కొత్త బ్యాంకింగ్‌ లైసెన్సులకు ఆర్‌బిఐ విముఖం

ముంబయి, జూలై 26 : భారీ పారిశ్రామిక సంస్థలు, బ్యాంకింగ్‌ రంగంలో లేని కంపెనీలు (కొత్తగా తమతమ వాణిజ్య బ్యాంకులను నెలకొల్పే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఎవరికి బ్యాంకింగ్‌ లైసెన్సులు ఇవ్వటాన్ని ఆర్‌బిఐ వ్యతిరేకిస్తోంది. కార్పొరేట్‌ సెక్టర్‌కు బ్యాంకింగ్‌ లైసెన్సుల మంజూరుకు కేంద్రీయ బ్యాంకు వ్యతిరేకిస్తోంది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి సవరణలను పార్లమెంట్‌ ఆమోదించిన తర్వాతే కొత్త లైసెన్సులు పరిశీలిస్తుంది. సవరణల వల్ల కేంద్రీయబ్యాంకుకు మరిన్ని సవరణలను పార్లమెంట్‌ ఆమోదించిన తర్వాతే కొత్త లైసెన్సులు పరిశీలిస్తుంది. సవరణల వల్ల కేంద్రీయ బ్యాంకుకు మరిన్ని అధికారాలు సంక్రమిస్తాయి. అందువల్ల బ్యాంకుల నిర్ణయాలను కాదని ఉత్తర్వులు జారీ చేయవచ్చు అని ఆర్‌బిఐ అధికారి ఒకరు చెప్పారు. బ్యాంకింగ్‌ లైసెన్సుల కోసం పలు కార్పొరేట్‌ సంస్థలు గత ఏడాది దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో అనిల్‌ అంబానీ గ్రూప్‌, మహీంద్రాస్‌, ఎల్‌ అండ్‌ టి, రెలిగేర్‌ తదితర సంస్థలున్నాయి. వీటి అంశాలపై నీళ్లు చల్లినట్లే. ఎన్‌బిఎఫ్‌సిలకు సంబంధించి విశ్వసనీయమైన దరఖాస్తులందలేదని ఆయన తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌, భవన నిర్మాణ రంగం, బ్రోకింగ్‌ కార్యకలాపాల్లో ఉన్న సంస్థలకు బ్యాంకింగ్‌ లైసెన్సులు ఇచ్చేది లేదని గతంలోనే ఆర్‌బిఐ స్పష్టం చేసింది.