గోదావరిలోకి భారీగా వరద నీరు

రాజమండ్రి: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి 6.57 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి జూన్‌లో 25, జూలైలో 251 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేయగా.. ఆగస్టు నెలలో ఇప్పటి వరకూ 120 టీఎంసీల నీటిని వదిలారు.