చేతులెత్తేసిన హైపవర్‌ కమిటీ

హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని అనుబంధ కళాశాలలో ఇటీవల జరిగిన బీటెక్‌ పరీక్షల అక్రమాలపై దర్యాప్తునకు నియమించిన హైపవర్‌ కమిటీ సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే చేతులెత్తేసింది. సోమవారం వర్సిటీలో జరిగిన సమావేశంలో పలు విద్యార్థి సంఘాలు నాయకులు వర్శిటీయేతర వ్యక్తులను కమిటీలో నియమించి దర్యాప్తు చేయాలని డిమాండు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు సీఎం, డిప్యూటీ సీఎంలకు ఈ అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు కమిటీని నియమించాలని కోరుతూ లేఖ రాసినట్లు రిజస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌వీ రమణరావు తెలియజేశారు.