డంకన్‌కు ఉద్వాసన పలకండి దిలీప్‌ వెంగ్‌సర్కార్‌

నూఢీల్లీ: వరుస వైఫల్యాల నేపథ్యంలో కోచ్‌ పదవి నుంచి డంకెన్‌ ఫ్లెచర్‌కు వెంటనే ఉద్వాసన పలకాలని మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ డిమాండ్‌ చేశారు. కోచ్‌గా ప్లెచర్‌ పూర్తిగా విఫలమయ్యాడని విమర్శిం చాడు. ప్లెచర్‌ హయాంలో టీమిండియా ఘెరపరాజయాలు చవి చూస్తోందని గుర్తుచ ేశాడు. కాగా ఇటీవలి కాలంలో ఎప్పడూ లేనంతగా టీమిండియా ఏడా దిన్నర నుంచే టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలి యా చేతిలో ఏకంగా పది మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. టీ-20 ప్రపంచ కఫ్‌తో పాటు వన్డే సిరిస్‌ ల్లోనూ భారత ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు ప్లెచర్‌ పూర్తిగా విఫమయ్యాడని నేరుగా ప్లెచర్‌కు ఉద్వాసన పలకాల్సిందేనని పెంగ్‌ సర్కార్‌ అన్నాడు. నిరుడు ప్రపంచకఫ్‌ విజయం తర్వా త కొంతమంది. భారత ఆటగాళ్లలో అలసత్వం దరి చేరిందని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ అంటున్నాడు. 2011 ప్రపంచకప్‌ విజయం తర్వాత కొంతమంది భారత ఆటగాళ్ల ధోరణిలో మార్పొచ్చింది. వరల్డ్‌కప్‌ గెలిచినందుకు దేశమే వారికి రుణపడి ఉన్నట్టు వారు ఫీలైపోతున్నారన్నారు.