డీజీపీలతో కేంద్రహోంమంత్రి షిండే భేటీ

న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాల డీజీపీలతో కేంద్రహోంమంత్రి సుషీల్‌కుమార్‌షిండే సమావేశమయ్యారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారకేసుల్లో తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. అత్యాచార కేసుల్లో కఠినశిక్షలు ఉండాలని డీజీపీలు షిండేకు సూచించారు. నేరాల నిరోదానికి డీజీపీలు కొన్ని సూచనలు చేశారని హోంమంత్రి షిండే తెలియజేశారు. జస్టీస్‌ వర్మ కమిటీ రావల్సిందేనని అన్నారు. త్వరితగతిన శిక్షలు పడేల కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించినట్లు వివరించారు.