న్యుమోనియా కేసుల వ్యాప్తి

` రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు
న్యూఢల్లీి (జనంసాక్షి): చైనాలో న్యుమోనియా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఎలాంటి పరిస్ధితి ఎదురైనా అధిగమించేందుకు సన్నద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది. చైనాలో న్యుమోనియా కేసులు ప్రబలుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రుల్లో తగిన ఏర్పాట్లకు సంబంధించి సవిూక్షించాలని రాష్ట్రాలను కోరింది. కాగా, గత కొన్ని రోజులుగా చైనాలో న్యుమోనియో తరహా కేసులు విపరీతంగా నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.చైనాలోని ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని, రోగ లక్షణాలు న్యుమోనియాను పోలి ఉన్నాయని కధనాలు వచ్చాయి. చైనా ఆసుపత్రుల్లో ఈ తరహా లక్షణాలతో చేరుతున్న వారిలో పిల్లలే అత్యధికంగా ఉన్నారని సమాచారం. మరోవైపు చైనాలో కొత్త రకం వైరస్‌ వ్యాపించిందనే వార్తలను డ్రాగన్‌ తోసిపుచ్చింది. ఇవి సీజనల్‌ శ్వాసకోశ సమస్యేలనని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇక చైనాలో న్యుమోనియా తరహా కేసుల తీవ్రతను గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ వెల్లడిరచారు. ఈ విషయంలో కేంద్రం అప్రమత్తంగానే ఉందని స్పష్టం చేశారు. చైనాలో న్యుమోనియా కేసుల ఉద్ధృతిని ఐసీఎంఆర్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నిశితంగా పరిశీలిస్తున్నట్టు వివరించారు. ఏదేమైనా భారత్‌కు న్యుమోనియా ముప్పు తక్కువేనని కేంద్రం ప్రకటించడం కొంత ఊరట కలిగిస్తోంది.