పాలకుర్తి నియోజకవర్గం 60 ఏళ్ల చరిత్రను తిరిగరాసిన యశస్విని రెడ్డి

పెద్దవంగర డిసెంబర్ 04(జనం సాక్షి )పాలకుర్తి నియోజకవర్గం 60 ఏళ్ల చరిత్రను తిరిగరాసిన యశస్విని రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గెలుపొందారని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు ఎడవెల్లి భూపాల్ రెడ్డి అన్నారు. 60 ఏళ్ల చరిత్రను కాంగ్రెస్ పార్టీ తిరగరాసి మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరవేసిందన్నారు. గత కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉండగా పాలకుర్తికి అనూహ్యంగా ఎస్ఎస్సి రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం పెరిగింది. పెద్ద వంగరలో దుర్గామాత ఆలయం వద్ద వారు ప్రత్యేక పూజలు చేసి గెలుపు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మల వీరన్న, ముద్దసాని హరి, బాంబుల సత్తిరెడ్డి, తుమ్మ మహేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సురేష్ బాబు, సాయి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.