పెళ్ళిచేసుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌

ప్యాంగ్‌యాంగ్‌, జూలై 26 : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌, రి సోల్‌ జు అనే యువతిని వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్యాంగ్‌యాంగ్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించారు. ఆమె వివరాలు రహస్యంగానే ఉంచారు. ఆమెను మిస్టరీ ఉమెన్‌గా అమెరికాతో పాటు పలు అంతర్జాతీయ దేశాలంటున్నాయి. ఇదే పేరుతో ఓ మహిళా గాయని ఉన్నారని, అయితే ఆమె, ఈమె ఒక్కరేనా కాదా అని సందేహాస్పదంగానే ఉంది. ఉత్తరకొరియా అధ్యక్షుడి వివాహంపై అమెరికా స్పందించింది. పెళ్ళి జరగడం మంచి వార్త అంటూనే ప్రజల కష్టాలు తొలగించే చర్యలు చేపటితే మరింత మంచి వార్త అవుతుందని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి విక్టోరియా వ్యాఖ్యానించారు. ఇటీవల ఆ మహిళతో కిమ్‌జాంగ్‌ పలు కార్యక్రమాల్లో కనిపించారని ఆమె ఆయన భార్య అయి ఉంటుందని మీడియా ఊహాగానాలు చేసింది.