మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ .పట్లోళ్ల దీప నర్సింలు
తాండూరు మార్చి 24(జనంసాక్షి) మహిళలు
వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ .పట్లోళ్ల దీప నర్సింలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు. అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని వివరించారు. నేటి సమాజ ంలో మహిళలు పురుషులతో సమానంగా
రాణిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయిపూర్ కు చెందిన మహిళలు, మోమ్మా సిబ్బంది మహిళలు తదితరులు ఉన్నారు.