మీడియాకు అన్నాహజారే క్షమాపణ

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద మీడియాపై తమ బృందం సభ్యులు దౌర్జన్యానికి పాల్పడటంపై అన్నా హజారే విచారం వ్యక్తం చేశారు. ఇందుకుగాను మీడియాకు ఆయన క్షమాపణలు తెలియజేశారు. దీక్షావేదికమీదనుంచి ఆయన ఈ విషయం ప్రకటించారు. దీక్షాసమయంలో ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడరాదని అలాచేస్తే తాను తక్షణం దీక్షను విరమిస్తానని ఆయన తన మద్దతుదారులను హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు జరిగితే వాటిని సాకుగాచూపి ప్రభుత్వం రెండు రోజుల్లో దీక్షాశిబిరాన్ని మూయించివేస్తుందన్నారు. అవినీతిపై పోరును మీడియాతో కలిసే తాము కొనసాగిస్తామన్నారు. దాడి ఘటనను అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఖండించారు.