లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశం రేపటికి వాయిదా పడింది. సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు యశ్‌వీర్‌ కేంద్రమంత్రి నారాయణస్వామి నుంచి కోటా బిల్లు ప్రతిని లాగేసుకున్నారు. ఆయన నుంచి బిల్లు ప్రతిని తిరిగి తీసుకునేందుకు సోనియా ప్రయత్నించారు. సోనియాకు అందకుండా యశ్‌వీర్‌ సింగ్‌ మరో సభ్యుడు నీరజ్‌ శేఖర్‌కి బిల్లు ప్రతిని అందజేశారు. నీరజ్‌ శేఖర్‌ దాన్ని చించివేయగా ఎస్పీ, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం చెలరేగింది. దాంతో సభను రేపటికి వాయిదా వేశారు.