శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
బిచ్కుంద ఫిబ్రవరి 22 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల మార్కెట్ కమిటీ ఆవరణములో బుధవారం నాడు మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్ మరియు సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజి శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాడ సర్పంచ్ శివానంద్, డైరక్టర్ ఖాన్సాబ్ మరియు మల్లికార్జున్ పటేల్ రైతులు తదితరులు పాల్గొన్నారు.