సీఎంతో చర్చించి పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తాం : బొత్స

ఢిల్లీ: సీఎంతో చర్చించి అనుకూలమైన తేదీలో పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షలు బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు తన నిర్ణయాలు మార్చుకుంటూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. చంద్రబాబు లేఖ తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపేలా లేదని, కాంగ్రెస్‌ను నిందించి లబ్ధిపొందేలా చంద్రబాబు లేఖ ఉందని బొత్స వ్యాఖ్యానించారు. 2009లో తెరాసతో తెదేపా చేసుకున్న ఒప్పందాన్ని లేఖలో చంద్రబాబు ఎందుకు ప్రస్తావించ లేదని ఆయన ప్రశ్నించారు.