తాజావార్తలు
- ‘హస్తమే’ ఆధిక్యం
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- మరిన్ని వార్తలు
ముత్తారం జనంసాక్షి/ ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున ముత్తారం మండలంలోని హరిపురం గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో క్షయ వ్యాధిపై వివిధ అధికారులతో, వైద్య సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించారు.రెండు వారాలకు పైగా దగ్గు ఉంటే క్షయ వ్యాధి కావచ్చు. మన అందరి పంతం -క్షయ వ్యాధి అంతం వంటి నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. క్షయ వ్యాధి కలవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కళ్లె పరీక్ష చేయించుకొని వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స తీసుకొని వ్యాధి నుండి వారు రక్షణ పొందటమే కాకుండా సమాజంలో క్షయ వ్యాధి వ్యాపించకుండా సహకరించాలని వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది కళావతి, జ్యోష్న తదితరులు పాల్గొన్నారు



