తాజావార్తలు
- అండర్ 14 రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- స్థాయికి తగ్గ మాటలు నేర్చుకో కేటీఆర్
- గ్రీన్‌ల్యాండ్ స్వాధీనానికి ట్రంప్ ఎత్తుగడలు
- చికిత్స కంటే నివారణే మార్గం
- ఎమ్మెల్యేను కలిసిన బిఆర్ఎస్ నేత : కోడూరు శివకుమార్ గౌడ్
- నిన్న ప్రియురాలు, నేడు ప్రియుడు బలవన్మరణం
- కొవ్వూరులో ట్రావెల్స్ బస్సు దగ్ధం
- వలపు వలలో చిక్కి..
- రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే మనమందరం భద్రంగా ఉంటాం
- మరిన్ని వార్తలు
ముత్తారం జనంసాక్షి/ ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున ముత్తారం మండలంలోని హరిపురం గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో క్షయ వ్యాధిపై వివిధ అధికారులతో, వైద్య సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించారు.రెండు వారాలకు పైగా దగ్గు ఉంటే క్షయ వ్యాధి కావచ్చు. మన అందరి పంతం -క్షయ వ్యాధి అంతం వంటి నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. క్షయ వ్యాధి కలవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కళ్లె పరీక్ష చేయించుకొని వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స తీసుకొని వ్యాధి నుండి వారు రక్షణ పొందటమే కాకుండా సమాజంలో క్షయ వ్యాధి వ్యాపించకుండా సహకరించాలని వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది కళావతి, జ్యోష్న తదితరులు పాల్గొన్నారు


