అంబేద్కర్ పార్కును సందర్చించిన జి ఎం వెంకటేశ్వర రెడ్డి
పినపాక నియోజకవర్గం ఆగష్టు 30 (జనం సాక్షి): మణుగూరు పివి కాలనీలో సింగరేణియుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డా బిఆర్ అంబేడ్కర్ పార్క్ ను సోమవారం రాత్రి ఏరియా జనరల్ మేనేజర్ జి. వేంకటేశ్వర రెడ్డి సంబందిత అధికారులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ అంబేద్కర్ పార్కు లో ఉన్న డాల్ఫిన్లు, సింగపూర్ లైయన్ మరియు పక్షులు తదితర కృత్రిమ ఆకృతుల ప్రతిమలను, పచ్చికతో నిండి ఉన్న గ్రౌండ్ ను, రంగు రంగుల పూలతో నిండిన పూల తోటలను, చిన్నారుల ఆట స్థలాన్ని ఎంతో ఆసక్తిగా పరిశీలించడం జరిగింది. అనంతరం పార్క్ నిర్వాహక బాధ్యతలు చూస్తున్న అధికారులతో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వేంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ… సింగరేణి మొత్తంలో ఉత్పత్తి, ఉత్పాదకతలో మణుగూరు ఏరియాకు ఎంత గుర్తింపు ఉందో, అలాగే అన్నీ ఏరియాల పార్క్ ల కంటే మన అంబేడ్కర్ పార్క్ మణుగూరు ఏరియాకు మణిహారంగా అంతా గుర్తింపు పొందింది. ఏరియా సింగరేణియుల వారి కుటుంబ సభ్యుల మరియు స్థానికులకు చక్కని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం కోసం ఖర్చుకు వెనుకాడకుండా అన్నీ హంగులతో నిర్మించబడిన ఈ పార్క్ అన్నీ విధాలా ఎల్లప్పుడు సర్వాంగ సుందరంగా నిలిచిపోయేలా సంబంధిత అధికారులు తరచుగా పార్క్ సందర్శిస్తూ పార్క్ పరిశుద్ధతను అందాన్ని కాపాడేందుకు కృషి చేయాలిని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం డి లలిత్ కుమార్ , ఏజిఎం(సివిల్) వెంకటేశ్వర్లు , డిజిఎం (ఈ.ఎం) సర్వే రెడ్డి , డిజిఎం (పర్సనల్) ఎస్. రమేశ్ , డివైఎస్ఈ(సివిల్) రాజేంద్ర ప్రసాద్ ,ఈఈ(సివిల్) ప్రవీణ్ , ఫారెస్ట్ ఆఫీసర్ బి కల్యాణ్ , సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.