అఖిలేశ్‌కు ¬ంశాఖ షాక్‌

ఎన్‌ఎస్‌జి రక్షణ తొలగించేందుకు నిర్ణయం?
న్యూఢిల్లీ,జూలై23(జ‌నంసాక్షి): ఎన్‌ఎస్‌జీ రక్షణను కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్‌ యాదవ్‌, ములాయంసింగ్‌ యాదవ్‌, మాయవతిలకు దీనిని తొలగించేందుకు కేంద్ర¬ంశాఖ పరిశీలిస్తోందని సమాచారం. ఇందులో భాగంగా  సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ అత్యున్నత స్థాయి ఎన్‌ఎస్‌జి భద్రతను కోల్పోనున్నారు. దేశంలో పలువురు రాజకీయ నాయకులు ఎన్‌ఎస్‌జీకి చెందిన బ్లాక్‌ క్యాట్‌ కమాండో సెక్యూరిటీని కలిగి ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అఖిలేష్‌ యాదవ్‌ ఒకరు. కాగా అఖిలేష్‌కు ఎన్‌ఎస్‌జీ భద్రతను తొలగించాల్సిందిగా కేంద్ర ¬ంమంత్రిత్వశాఖ నిర్ణయించినట్లుగా సమాచారం. దేశంలోని వీఐపీల భద్రతపై సవిూక్ష చేసిన కేంద్ర ¬ంమంత్రిత్వశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ సైతం జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీని కలిగి ఉన్నారు. అదేవిధంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, పంజాబ్‌ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, అసోం సీఎం సర్బనంద సోనోవాల్‌, ప్రఫుల్లా మహంతా, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్‌, ఎల్‌కే ఆద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్‌ ఎన్‌ఎస్‌జీ భద్రతను కలిగి ఉన్నారు. కాగా తాజా సవిూక్ష అనంతరం పెద్దగా ముప్పేవిూలేని కారణంగా అఖిలేష్‌ భద్రతలో ఉన్న 22 ఎన్‌ఎస్‌జీ కమెండోలను వెనక్కి పిలుస్తున్నారు.