అగస్టా స్కాంలో త్యాగి సహా పదకొండు మందిపై సీబీఐ ప్రాథమిక నేరారోపణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) :
అగస్టా హెలిక్యాప్టర్ల కుంభకోణంలో సీబీఐ మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్పీ త్యాగి సహా పదకొందు మందిపై ప్రాథమిక నేరారోపణ చేసింది. రాష్ట్రపతి, ప్రధాని సహా 12 మంది వీవీఐపీల కోసం అత్యంత రక్షణతో కూడిన హెలీక్యాప్టర్లు కొనుగోలు చేయాలని కేంద్రం సంకల్పించింది. ఆ సమయంలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌గా ఉన్న త్యాగి బిడ్డింగ్‌ నిబంధనల మార్చి ఇటలీ ప్రభుత్వ అధీనంలోని అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు అవకాశం కల్పించారని అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో త్యాగి బంధువులు, సోదరుల ద్వారా ఫిన్‌మెకానికా కంపెనీతో సంప్రదింపులు జరిపారు. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లుగా ఇటలీ పోలీసులు అభియోగాలు మోపి, ఫిన్‌మెకానికా సీఈవో గిస్పీ ఓర్సీ, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ సీఈవో బ్రూనో స్పగ్నోలినిని అదుపులోకి తీసుకొని విచారించింది. 2007 నుంచి 2012 మధ్య కాలంలో ఇటలీ నుంచి ట్యునీషియా మీదుగా భారత్‌లోకి ప్రవేశించాయి. ఇందుకు హాస్కే మధ్య వర్తిగా వ్యవహరించాడు. ఈ వ్యవహారంలో సీబీఐ అధికారులు ఎరోమ్యాట్రిక్స్‌ డైరెక్టర్లు గైడో రాల్ఫ్‌ హాస్క్‌లే, ఫుర్నాండో కార్లో వాలెంటిరో గెరోసా లంచాలు ఇవ్వజూపారని అభియోగాలు నమోదు చేసింది.