అత్యధిక స్టంపింగ్స్ హీరో ధోనీ
రాబిన్ ఊతప్ప రికార్డును బ్రేక్ చేసిన మహి
ముంబయి,మే28( జనం సాక్షి ): ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో కర్ణ్‌శర్మ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా మిస్టర్ కూల్ ఈ మైలురాయి చేరుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో అతడి స్టంపింగ్స్ సంఖ్య 33కు చేరింది. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప పేరిట ఉన్న 32 స్టంపింగ్స్ రికార్డును తాజాగా మహీ బ్రేక్ చేశాడు. కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్(30), వృద్ధిమాన్ సాహా(18) తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడిన వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ గొప్ప ప్రదర్శనే చేశారు. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, ధోనీ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ బ్యాట్‌తో చెలరేగడంతో పాటు వికెట్ల వెనుక కూడా ఆకట్టుకున్నారు.