అధికార బిజెపికి గట్టి పోటీ ఇస్తున్న విపక్ష ఎస్పీ
నాలుగు దశల్లోనూ సమ ఉజ్జీగా నిలిచిందన్న విశ్లేషణలు
లక్నో,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉత్తరప్రదేశ్ ఎన్నికల సరళిని చూస్తుంటే పోటీ బిజెపి, ఎస్పీ మద్యనే ఉందన్న
ప్రచారం సాగుతోంది. సర్వేలు ఎలా ఉన్నా ఎస్పీ గట్టిగానే పోటీ ఇస్తోందని స్థానికంగా చర్చిస్తున్నారు. ఇక యోగి పాలనపైనా ప్రజల్లో సానుకూలత ఉన్నా..మోడీ విధానాలు కూడా వ్యతిరేక ప్రభావం చూపేలా ఉన్నాయి. ఇప్పటికే నాలుగు దశల్లో పోలింగ్ ముగిసింది. మరో మూడు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ప్రియాంక కష్టపడుతున్నా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న ప్రచారం కూడా ఉంది. మొత్తంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అగ్నిపరీక్ష కాబోతుండా విపక్ష ఎస్పీకి మాత్రం ఆశాజనకంగా ఉన్నాయని తెలుస్తోంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో తొలి మూడు విడతల్లో ఇప్పటిదాకా 172 చోట్ల పోలింగ్ పూర్తయింది. వీటిలో ఎవరిది పై చేయి అన్నదానిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సమాజ్‌వాదీ`ఆర్‌ఎల్డీ కూటమికి, బీజేపీకి మధ్య హోరాహోరీ నడుస్తోందని పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేల్లో వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. మూడు విడతలపై సర్వే సంస్థల అంచనాల సగటును పరిశీలించినా బీజేపీ, ఎస్పీ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డట్టు కనిపిస్తోంది. పోలింగ్ జరిగిన 172 స్థానాలను అటు ఇటుగా చెరిసగం పంచుకునే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. మిగతా పార్టీల ప్రభావం నామమాత్రమేనని అంటున్నారు. మొత్తవ్మిూద మూడు దశల అనంతరం ఎస్పీ కూటమి స్వల్ప ఆధిక్యంలో కనిపిస్తోందని, రాబోయే దశల్లో బీజేపీ సత్తా చాటుతుందని అంచనా వేస్తున్నారు. బీఎస్పీ ఓటు బ్యాంకు కూడా బీజేపీ, ఎస్పీలకు చెరో సగం చొప్పున బదిలీ అవుతోందన్నది సర్వే సంస్థల అంచనా. అభ్యర్థి, కుల సవిూకరణలను బట్టి ఇది కాస్త అటూ ఇటుగా ఉండొచ్చని స్థానిక రాజకీయ పరిశీలకుల అంచనా. బీజేపీకి 2017లో వచ్చిన సీట్లతో పోలిస్తే 30 శాతం దాకా తగ్గే అవకాశముందని అంచనాలు ఉన్నాయి. మొదటి రెండు దశల పోలింగ్‌పై ఎస్పీ కూటమి పెట్టుకున్న అంచనాలు ఫలించనట్టు కన్పిస్తోంది. ఆర్‌ఎల్‌డీ ప్రభావం కనిపించే పశ్చిమ యూపీలోని జాట్ సామాజిక వర్గం ఎస్పీ`ఆర్‌ఎల్డీ కూటమి వైపు మొగ్గుచూపుతుందని, ఈ రెండు దశల్లోనే 40 నుంచి 50 సీట్ల ఆధిక్యత వస్తుందని అంచనాలు వేసుకున్నారు. మూడో విడత పోలింగ్ హోరాహోరీగా సాగినా బీజేపీకే స్వల్ప ఆధిక్యం కన్పించిందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. నాలుగో దశలోనూ అదే ట్రెండ్ కనిపించిందంటున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రెండు దశల్లో ఎస్పీ కూటమి సాధించే ఆధిక్యం అధికారానికి బాటలు పరిచేంతగా ఉండదని అంచనా. ఉత్తర భారతంలో తిరుగులేని శక్తిగా స్థిరపడ్డ బీజేపీ దక్షిణాదిన, ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయడానికి కావాల్సిన ఊపును యూపీ ఫలితాలు అందిస్తాయని భారీ అంచనాలతో ఉంది. ఈ నేపథ్యంలో యూపీలో అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని మోదీ సహా 24 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ తరపున అఖిలేశే చెమటోడుస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన నాలుగో దశ ఎన్నికల్లో 57.45శాతం పోలింగ్ నమోదైంది. తొమ్మిది జిల్లాల్లో 59 సీట్లకు జరిగిన ఈ దఫా ఎన్నికల బరిలో 624మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం తొమ్మిది జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ఫిలిబిత్ జిల్లాలో 61.33శాతం, గతేడాది నలుగురు రైతులు మరణించిన లఖింపూర్ ఖేరిలో 62.42 శాతం మంది ఓటింగ్‌లో పాల్గగొన్నారు. లక్నోలో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో బిఎస్‌పి అధ్యక్షురాలు
మాయావతి, రాష్ట్ర మంత్రి బ్రిజేష్ పాథక్ తదితరులు ఉన్నారు.