అన్నదాతల ఆదాయం రెట్టింపే లక్ష్యం

అందుకు అనుగుణంగా మోదీ సర్కార్‌ కసరత్తు
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  స్వతంత్ర భారతదేశానికి 2022లో 75 ఏళ్లు నిండుతాయి. స్వాతంత్య అమృతోత్సవాల నాటికి అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడం మోదీ సంకల్పాలలో ముఖ్యమైనది. ఇక 2024లో ఎన్డీఏ రెండో ప్రభుత్వ ఐదేళ్ల గడువు ముగుస్తుంది. 2024లోగా మన యువతకు ఉపాధి అవకాశాలను విస్తరింపజేసి, శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిస్తూ, ప్రజల జీవన స్థితిగతులను పెంపొందించడమే నరేంద్రమోదీ ప్రభుత్వ మహా లక్ష్యంగా చెప్పుకుంది. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ తన తొలి వంద రోజుల పాలనలో పలు కీలక నిర్ణయాలను త్వరితగతిన అమలు పరిచారు. అసాధారణ విజయాలతో కొత్త చరిత్రను సృష్టించారు. ప్రస్తుతం ప్రపంచంలో మన దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఐదేళ్ల క్రితం మనం 11వ స్థానంలో ఉండేవాళ్లం అని గుర్తించాలి. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తరువాతనే మనం ఐదో స్థానానికి పురోగమించాం.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బ్జడెట్టే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి.  ముఖ్యంగా 25 శాతం కార్పొరేట్‌ పన్ను చెల్లించడానికి ఇప్పుడున్న వార్షిక టర్నోవర్‌ పరిమితి రూ.250 కోట్లను రూ.450 కోట్లకు పెంచింది. ఫలితంగా చాలా సంస్థలు ఈ పన్ను నుండి విముక్తమవుతాయి. జీఎస్టీలో రిజిస్టరైన కొన్ని సంస్థలు తీసుకునే రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ ఇచ్చేందుకు రూ.350 కోట్లు కేటాయించారు. కోటిన్నర కన్నా తక్కువ వార్షిక టర్నోవర్‌ ఉండే రిటైల్‌ వ్యాపారులు, చిన్న దుకాణదారులకు కొత్తగా పింఛన్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. గ్రావిూణ సడక్‌ యోజన సహా పలు పథకాలకు కేటాయింపులు పెంచారు. రానున్న ఐదేళ్ళలో రూ.80వేల కోట్లతో 1,25,000 వేల కి.విూ. రహదారుల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశిరచుకున్నారు. రైతుల సంక్షేమానికి మోదీ సర్కారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగుతోంది. దిగుబడులకు తగిన గిట్టుబాటు ధర అందించాలన్నది రైతుల డిమాండ్‌. ఈ డిమాండ్‌ను నెరవేర్చడానికై 24 పంటల విషయంలో ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు అదనంగా యాభై శాతం రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా మోదీ సర్కార్‌ చర్యలు చేపట్టింది. 2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్నది మోదీ ప్రభుత్వ సంకల్పం. ఈ సంకల్ప సాధనకై ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఆరు వేల రూపాయలు మంజూరు చేసే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పరిధిలోకి ఇప్పటికే 14 కోట్ల మంది రైతులను తీసుకువచ్చారు. సాగుదారులు అందరికీ పింఛను పథకం అమలుపరచాలని మోదీ ప్రభుత్వం తీర్మానించింది. /ూష్టాల్ర మధ్య తలెత్తే నదీ జలాల వివాదాలను దశాబ్దాలపాటు కొనసాగనివ్వకుండా నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించడానికి మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో వున్నది. ఇందుకు అనుగుణంగా ‘అంతర్రాష్ట నదీ జలాల వివాదాల పరిష్కార చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న విభిన్న ట్రిబ్యునళ్ల స్థానంలో ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఈ ట్రిబ్యునల్‌ ఒకసారి తీర్పు వెలువరిస్తే అదే అంతిమం. వైద్య రంగంలో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చట్టాన్ని మోదీ సర్కార్‌ తీసుకువచ్చింది. ఇది, దేశ వైద్య రంగ చరిత్రలో ఒక అతిపెద్ద సంస్కరణగా నిలిచిపోతుంది. ప్రభుత్వ సీట్లతో పాటు 50 శాతం ప్రైవేట్‌ సీట్లు కూడా ఆర్థికంగా వెనుకబడిన మెరిట్‌ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.  అలాగే పిల్లలపై జరిగే అకృత్యాలను అరికట్టేందుకు పోక్సో చట్టాన్ని తీసుకువచ్చారు. అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడిన సివిల్‌ సర్వెంట్లను స్వచ్ఛంద పదవీ విరమణ చేయించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టారు. తద్వారా అవినీతి విషయంలో ఎలాంటి వారినైనా ఉపేక్షించేదిలేదని మోదీ ప్రభుత్వం ఆచరణాత్మకంగా హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించటం లక్ష్యంగా కేంద్రం జల్‌శక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ శాఖ అధికారులు పర్యటిస్తూ వాననీట ఇసంరోణపై కార్యక్రమాలు ఉదృతం చేస్తున్నారు.