అమ్మ దయతో ఇంతకాలం రాజ్యసభలో గడిపా

వీడ్కోలు ప్రసంగంలో అన్నాడిఎంకె ఎంపి మైత్రేయన్‌ కంటతడి
న్యూఢిల్లీ,జులై24(జ‌నంసాక్షి): పదవీవిరమణ చేసిన రాజ్యసభ సభ్యుడు,అన్నాడీఎంకే సీనియర్‌ ఎంపీ వి.మైత్రేయన్‌ బుధవారంనాడు రాజ్యసభలో కంటతడి పెట్టారు. బుదశారంతో  ఆయన పదవీకాలం ముగుస్తోంది. ఈ  సందర్భంగా ఆయన వీడ్కోలు ప్రసంగం చేస్తూ, తనకు ఇంత గౌరవం కల్పించిన అమ్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తమిళనాట అమ్మగా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను గుర్తు చేసుకుంటూ  ఆయన కంటతడి పెట్టారు. పదవీ విరమణ చేస్తున్న ఈ తరుణంలో నా ప్రియతమ నేత అమ్మకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమ్మ నా విూద ఎంతో నమ్మకం ఉంచి మూడు సార్లు రాజ్యసభకు పంపారు. అన్నాడీఎంకే నుంచి అలాంటి గౌరవం దక్కిన ఏకైక నేతను తానే అని వెల్లడించారు. ఆమె పట్లతననాకున్న విధేయత ఎల్లకాలం అలాగే ఉంటుందంటూ  మైత్రేయన్‌ భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ, మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీకి సైతం మైత్రేయన్‌ కృతజ్ఞతలు తెలిపారు. అరుణ్‌ జైట్లీ తనను ఒక సోదరుడిలా చూస్తూ, మార్గదర్శిగా నిలిచారని, ఆయనకు పూర్తి స్వస్థత చేకూరి తనలాంటి ఎందరికో మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటున్నానని అన్నారు. 1990 నుంచి ప్రధాని మోదీ తనకు తెలుసునని, ఆయన తన చిరకాల మిత్రుడని, ఆయనకూ, అమ్మకు మధ్య విశ్వసనీయ రాయబారిగా తాను వ్యవహరించానని చెప్పారు. ప్రధాని తన పట్ల చూపిన ఆదరాభిమానాలను ఎన్నటికీ మరచిపోలేనని మైత్రేయన్‌ అన్నారు.