అయోధ్యపై ఎన్నికల రాజకీయాలు మానాలి

ఆలయ నిర్మాణంలో రాజీపడకుండా చూడాలి
న్యూఢిల్లీ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): అయోధ్యపై బిజెపి రాజకీయాలు మానుకుంటేనే ప్రజలు నమ్ముతారు. కేవలం ఎన్నికల ముందు మాత్రమే రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకునే యత్నాలు మానుకోవాలి. అయోధ్య అంటే రాముడన్న భావన ప్రజల్లో కూడా రావాలి. కేవలం అయోధ్యలోనే ఆలయం నిర్మించాలనుకోవడం ఎందుకన్న విషయం కూడా వ్యతిరేక పోరాటాలు చేస్తున్నవారు గమనించాలి.  మనదేశ చరిత్ర గురించి మనం తెలుసుకోకుంటే ఎవరు తెలుసుకుంటారు. ముఖ్యంగా మనదేశం అనేక విదేశీయుల దండయాత్రకు గురయ్యింది. వారిదాడిలో  ఇక్కడి సంస్కృతిని నాశనం చేశారు. ఇక్కడి దేవాలయాలను ధ్వంసం చేసారు. చివరకు మనదేశాన్ని ముక్కలు చేయాల్సి వచ్చింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల ఆవిర్భావం భారత్‌ నుంచే అన్నది చరిత్ర. ఇదంతా నేటితరానికి తెలియాలి. చరిత్ర పాఠాలను పాఠ్యాంశాల్లో తప్పనిసరి చేయాలి. అప్పుడే మనమేంటో మన సంస్కృతి ఏమిటో భారతదేశం అంటే ఏమిటో తెలుస్తుంది. అయోధ్య,కాశీ, మధురల గురించి మాట్లాడగానే ఓటు బ్యాంక్‌ రాజకీయాలు అంటారు. ఈ ఆలయాలను ధ్వంసం చేసిన సంగతి తెలియని వారు మాట్లాడే మాటలుగా గుర్తించాలి. నిజానికి భారత చరిత్రను వక్రీకరించిందే వామపక్షాలు. విదేశీయులు. ఇది కర్ణకఠోరమైన వాస్తవం.  అలాగే అయోధ్య, మధుర, కాశీ, సోమ్‌నాథ్‌ లాంటి పవిత్రస్థలాల్లో దాడులు చేసింది ఎవర్నదానికి చరిత్ర ఉంది. అక్కడ హిందువుల పవిత్ర ఆలయాలను కూల్చింది కూడా ముస్లిం పాలకులే. ముస్లింల దండయాత్రలోనే నలందా విశ్వ విద్యాలయం ధ్వంసం అయ్యింది. అక్కడి పవిత్ర తాళపత్ర గ్రంధాలను తగులబెట్టారు. అయోధ్య కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడివున్న అంశం. ఇక్కడ రామాలయం ధ్వంసం చేసి బాబర్‌ మసీదు కట్టాడన్నది చరిత్ర.  ఇలా అయోధ్య, వారణాసి, కాశీలల్లో మన ఆలయాలను నాటి దురాక్రమణ దారులు కూల్చి మసీదులు కట్టారు. వేలాది గుళ్లూ గోపురాలను కూల్చారు. వీటన్నికి చరిత్ర సాక్షీభూతంగా ఉంది. వీటిని సరిచేసుకునే అవకాశాలు రావాలి. అయోధ్య అంటేనే రామాయణం. హిందువులకు పరమపవిత్రం అయిన ప్రాంతం. ఇలా భారతదేశంలో హిందువుల పవిత్ర స్థలాలను లక్ష్యంగా చేసుకుని ఆనాటి పాలకులు దాడులు చేసి, ధ్వంసం చేశారు. అందుకే చరిత్రపై  యూపి ఎమ్మెల్యే సోమ్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అంతా ఉలిక్కిపడ్డారు.  సోమ్‌ వ్యాఖ్యలను అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఖండించారు. పాతబస్తీలో అమాయక ముస్లిం స్త్రీలను అరబ్బు షేకులు పెళ్లి పేరుతో వంచన చేస్తున్నా స్థానిక ఎంపిగా అసదుద్దీన్‌కు పట్టదు. అక్కడి అమాయక బాలికలును వ్యభిచార కూపంలోకి నెడుతున్నా పట్టించుకోరు. కనీసంగా ప్రకటన చేయరు. మహిళలను ఆరాధించే మనదేశంలో ఇలా జరగడాన్ని మనం అంగీకరిస్తామా అన్నది కూడా ఆలోచన చేయాలి. నిజానికి ఇంతగా అసహనానికి గురవ్వాల్సిన అవసరం లేదు. అయితే అయోధ్యపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తూ ఎన్‌ఇనకల ముందు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడం సరికాదు. అయోధ్య అంటే రాముడు అన్న రూఢి జరగాలి.