అలస్కాను కుదిపేసిన భూకంపం

రిక్టర్‌ స్కేల్‌పై 7.0గా నమోదు
న్యూఢిల్లీ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): అలస్కాను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భూకంపం నమోదు అయ్యింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మరో సారి 5.7 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో మంచు ప్రాంతమైన అలస్కా అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలు బిల్డింగ్‌ల నుంచి పారిపోయారు. తీర ప్రాంతాల్లో సునావిూ హెచ్చరికలు జారీ చేశారు. యాంకరేజ్‌కు 11 కిలోవిూటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదు అయ్యింది. యాంకరేజ్‌ సిటీలో సుమారు మూడు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఆ నగరానికి సవిూపంలో మరో లక్ష మంది జీవిస్తుంటారు. అయితే శుక్రవారం భూకంపం తర్వాత సుమారు 40 సార్లు ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో 4.0, 5.0 తీవ్రతతో పదేసి సార్లు ప్రకంపనలు నమోదు అయ్యాయి. వేల కిలోవిూటర్ల దూరంలో ఉన్న అమెరికా నగరమైన బోస్టన్‌లోనూ సెసిమోవిూటర్లు భూ ప్రకంపనలను నమోదు చేశాయి. రాష్ట్రంలో భారీ విధ్వంసం జరిగిందని గవర్నర్‌ బిల్‌ వాకర్‌ ఓ ప్రకటన కూడా చేశారు.