అవతార పురుషుడికి జాతిని అంటగడగతారా?
యోగి వ్యాఖ్యాలపై జైపూర్‌లో నిరసన
హనుమత్ ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు
జైపూర్,డిసెంబర్1(జనంసాక్షి): యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ రాజస్థాన్‌లోని జైపూర్ పట్టణానికి నలువైపులా గల హనుమంతుని ఆలయాల్లో ప్రార్ధనలు నిర్వహించారు. సర్వ బ్రాహ్మణ మహాసభ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. హనుమంతుడికి కూడా కులాలను అంటగ్టిన యోగిపై వారు మండిపడుతున్నారు. అవతార పురుషులను యోగి కించపరిచారని అన్నారు. ఈ సందర్భంగా మహాసభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా మాట్లాడుతూ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి… మా హనుమంతునికి జాతిని అంటగట్టారు. ఇది హనుమంతుని అవమానించడమే అవుతుంది. యోగితోపాటు ఇతర బీజేపీ నేతలు కూడా వారి రాజకీయ ప్రయోజనాల కోసం హనుమంతుని పేరు వాడుకుంటున్నారని ఆరోపించారు. కాగా అల్వర్‌లో నవంబరు 27న తన ప్రచార సభలో యోగి.. హనుమంతుణ్ణి దళితునిగా పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచనలు చేయడమే దారుణమని వ్యాఖ్యానించారు. అందుకే అపచార పూజలు చేస్తున్నామని అన్నారు.



