*ఆర్టీసీ ఉద్యోగులకు స్ట్రెస్ మెసేజ్ మెంట్ హ్యాండ్ బీయింగ్ సెమినార్ కార్యక్రమం*
మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 16
(జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాల మేరకు మెట్పల్లి ఆర్టీసీ డిపోలో మూడవ సెమినార్ లో భాగంగా డాక్టర్ ప్రముఖ సైకాలజిస్ట్ రాజా రత్నాకర్ మెట్పల్లి ఆర్టీసీ డిపో ఉద్యోగులకు డ్రైవర్ , కండక్టర్లకు
స్ట్రెస్ మెసేజ్ మెంట్ హ్యాండ్ బీయింగ్ క్రియేటివ్ అనే దమ్స్ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సైకాలజిస్ట్ డాక్టర్ రాజ రత్నాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు కండక్టర్స్ , డ్రైవర్లు ప్రశాంతత ఓపిక సహనం కలిగే విధంగా వారికి మానసిక ఒత్తిడి నుంచి బయటకు వచ్చి ప్రశాంతత ఉండేలా టెక్నికల్ గా సైకాలజిస్ట్ పరంగా వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందని అలాగే ఈ సెమినార్ డ్రైవర్ లకు, కండక్టర్లకు ఒత్తిడి నుండి బయటపడి ఉద్యోగరీత్యా డ్యూటీలో ఉండగా ఆనందంతో ఉంటారని అలాగే ఇంటికి వెళ్ళాక కూడా ఉల్లాసంగా ఉంటారని ఒత్తిడి ఉండదని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం చందర్రావు , ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ ,డిపో అసిస్టెంట్ మేనేజర్ రాజయ్య ,మరియు కండక్టర్స్ డ్రైవర్ లు పాల్గొన్నారు .