ఆర్థికంగా రాష్టాల్రను దెబ్బతీసే కుట్ర
రాజకీయంగా గుప్పిట్లో పెట్టుకునే యోచన
ప్రాంతీయ పార్టీలకు పొగపెడుతున్న మోడీ
న్యూఢల్లీి,ఫిబ్రవరి2: ముందున్నజనం సాక్షి ముసళ్ల పండగా అన్న సామెత ఇప్పుడు మనకు అనుభవం లోకి రానుంది. ఐదురాష్టాల్ర ఎన్నికలు ముగిసిన వెంటనే ఫలితాలు అనుకూలంగా ఉన్నా.. లేకున్నా అనేక విధాలుగా ప్రజలు భారం మోయాల్సి రావచ్చు. ప్రధానంగా పెట్రోల్ ధరలు పెరగడం… జిఎస్టీ స్లాబులు పెరగడం లాంటివి అనివార్యం కావచ్చు. రాష్టాల్రను ఆర్థికంగా దెబ్బతీసి రాజకీయంగా లబ్దిపొందానల్న దురాలోచనలో కేంద్రం ఉన్నట్లు కనపడుతోంది. ఇప్పటికే ఎపి ప్రభుత్వం ఈ దశకు చేరుకుంది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంది. బయటకు కనిపించకున్నా ఆర్థికంగా అనేక రాష్టాల్రు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తము అనుకున్న రీతిలో రాష్టాల్రను ఊబిలోకి దించి విద్యుత్, ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలన్న ప్రణాళిక వేస్తున్నారు. మోడీ దృష్టిలో ఎంత మేరకు ఆదాయం
రాబట్టామనే లెక్కలు వేసుకుంటున్నారు. జిఎస్టీ ఆదాయాన్ని విజయంగా చూస్తున్నారు. దీంతో ప్రజలు పడుతున్న బాధలు కనిపించడం లేదు. అయితే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వాల కాలం నుంచే మొదలయ్యింది. యూపిఎ హయాంలో జిఎస్టీ తీసుకుని రావాలన్న నిర్ణయాన్ని ప్రస్తుత బిజెపి పాలకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మోడీ కూడా గుజరాత్ సిఎం హోదాలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాష్టాల్ర హక్కులను హరిస్తుందని, ప్రజలపై భారం పడుతుందని వాదించారు. కానీ తాను ప్రధాని అయ్యాక దీనిని బలవంతంగా ప్రజలపై రుద్దారు. ఇప్పుడు జిఎస్టీతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో అనుభవంలోకి వచ్చింది. ఒకేరకమైన పన్ను విధానంతో రకరకాల పన్నులు పోయి ఒకటే విధానం ఉంటుందని,సులభంగా కూడా ఉంటుందని ఆనాడు మోడీ వాదించారు. మోడీ వచ్చాక జిఎస్టీని పట్టుబట్టి అమలు చేయడంతో కేంద్రం పక్కా వ్యాపార ధోరణితో ప్రజల నుంచి ముక్కుపిండి పన్నలు వసూలు చేస్తోంది. వివిధ దేశాలలో ఒకే రకమయిన పన్ను విధానం ఉండడం ప్రపంచీకరణకు అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుందన్న భావనతో, పన్ను సంస్కరణ లు మొదలయ్యాయి. కానీ అమెరికా వంటి దేశంలో కూడా జిఎస్టికి చుక్కెదు రయింది. అక్కడ వారికి ఒకే విధానం కంటె, రాష్టాల్ర ప్రతిపత్తే ముఖ్యం అన్న విధాంలో ఉన్నారు. దీర్ఘకాలం జిఎస్టిపై జరిగిన చర్చలలో రాష్టాల్ర హక్కులకు హాని కలుగకుండా సంస్కరణను ఎట్లా సాధ్యం చేయాలన్న అంశంపై వాదోపవాదాలు జరిగాయి. కొత్త విధానంలోకి మారిన వెంటనే కలిగే నష్టానికి పరిహారం చెల్లిస్తామని కేంద్రం వాగ్దానం చేసింది. జిఎస్టి విధానం అమలు మొదలైన తరువాత, కరోనా ఇబ్బందుల కాలంలోనూ పన్ను వాటా ఆదాయం గణనీ యంగా తగ్గిపోయిన సందర్భంలో పరిహారం ఇవ్వడానికి కేంద్రం ఎన్నో మెలికలు పెట్టింది. చివరకు కొంత ఇచ్చింది కానీ, ఇవ్వవలసినంత మాత్రం ఇవ్వలేదు. రాష్టాల్రను ఇబ్బంది పెట్టడానికి ఆర్థిక కేటాయింపులను వాడడంలో ప్రస్తుత కేందప్రభుత్వం రాజకీయ వ్యూహం చూపుతున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతిపక్ష రాష్టాల్ర విషయంలో నిధుల కేటాయింపులు, అనుమతుల విషయంలో పక్షపాతం చూపడం, దానికి ప్రతిస్పందనగానే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవిం చడం జరిగింది. బిజెపి ప్రభుత్వం, తీవ్రజాతీయత సహాయంతో ప్రాంతీయ శక్తులను బలహీనపరచడానికి, రాష్టాల్రను పరాధీనం చేయడానికి ప్రయత్ని స్తున్నది. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే పరీక్ష, చివరకు ఒకే ఎన్నికల దాకా పరిస్థితి వెడుతున్నది. జిఎస్టి పరిహారం సందర్భంలో, తాము కోరుతున్న సంస్కరణలను అమలు చేయడాన్ని ఒక షరతుగా పెట్టడం చూశాం. మొత్తం ఆదాయం కేంద్రం నుంచి మాత్రమే రావలసి వస్తే, ఇక రాష్టాల్రకు సొంత విధానాలు అంటూ ఏవిూ మిగలవు. తాజాగా అలాంటి పరిస్థితులు కల్పిస్తు న్నారు. రాష్టాల్రను ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా అక్కడ పాగా వేయాల న్నది మోడీ నేతృత్వంలోని బిజెపి ప్లాన్‌గా ఉంది. ప్రజల్లో ప్రాంతీయ పార్టీలను చులకన చేసి లేదా మరో రకంగా అధికారం కబ్జా చేయాలని చూస్తున్నారు. జిఎస్టీ సవరణలు కోరినా పట్టించుకోవడం లేదు. అలాగే ఇటీవల చేనేతపైనా భారీగా జిఎస్టీ పెంచాలని చూశారు. అయితే రాష్టాల్రు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు. అయితే రాష్టాల్రు ఆర్థికంగా దెబ్బతింటే మంచిదన్న భావనలో మోడీ ఉన్నారు. అవి ఆర్థికంగా గిలగిల కొట్టుకుంటుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని..అప్పుడు అక్కడ పాగా వేయాలన్నది మోడీ వ్యూహంగా ఉంది.