ఆర్థికవృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది: రాష్ట్రపతి

హైదరాబాద్‌ సహా ఆరుచోట్ల ఔషధ పరిశోధన సంస్థలు
న్యూఢిల్లీ : ప్రపంచంలో నెలకోన్న ఆర్ధిక మాంధ్యం మనదేశంపైనా ప్రభావం చూపుతోందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభిస్తూ పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పెట్టుబడులు, ఆర్ధిక వృద్ధికి కేంద్రం పలు చర్యలు చేపట్టిందని, పింఛన్లు, ఇతర సంక్షేమ రాయితీలన్నీ నేరుగా లబ్ధిదారులకే అందేలా చర్యలు చేపట్టామని, నగదు బదిలీతో ప్రజాపంపీణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయాలన్నదే లక్ష్మమని రాష్ట్రపతి చెప్పారు. ద్రవ్యలోటును అధిగమించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ద్రవ్యోలోటును అధిగమించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ సమస్యగానే ఉందన్నారు.  ప్రతికూల పరిస్థితులున్నా వ్యవసాయ ఉత్పత్తిలో ప్రగతి సాధిస్తున్నామని రాష్ట్రపతి పేర్కొన్నారు. యూరియా ఉత్పత్తిలో స్వావలంబన కోసం 100 లక్షల టన్నుల ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామని, 12వ పంచవర్ష ప్రణాళికలో 87 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్రపతి చెప్పారు. ఇందిరా ఆవాన్‌ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి రూ. 40 వేలనుంచి 70 వేలకు పెంచామన్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం 2014 మార్చి వరకు పొడిగిస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో రక్షత మంచినీటి పథకాల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. 2022 నాటికి అన్ని గ్రామీణ ప్రాంతాలకు రక్షిత మంచినీటి సరఫరా లక్ష్యమని వెల్లడించారు. మహిళల భద్రతపై దృష్టి పెడతామని, మహిళల భద్రత విషయంలో జిస్టిన్‌ వర్మ కమిటీ సిఫార్సులను ఆమోదించామని మహిళలపై నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేశామని రాష్ట్రపతి తెలిపారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళికలో రూ. 1.23 లక్షల కోట్లు కేటాయించామన్నారు. నర్సుల కొరత తీర్చేందుకు దేశంలో 200 నర్సింగ్‌ కళాశాలలకు అనుమతిచ్చినట్లు చెప్పారు. ఉన్నత విధ్య అభివృద్ధికి ప్రత్యేక పథకం ప్రారంభించామని, జాతీయ బాలల ఆరోగ్య పథకం కింద 2.70 కోట్ల మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అసంఘటిత కార్మికుల కోసం జాతీయ ఆరోగ్య బీమా పథకం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఉత్పాదక రంగంలో 10 కోట్ల మందికి ఉపాథి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాదుతో సహా ఆరు ఔషధ పరిశోధన సంస్థలు నెలకొల్పనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు.