ఆర్థికాభివృద్ధికి సంస్కరణలు కొనసాగుతాయి: చిదంబరం

న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధికి సంస్కరణలు కొనసాగుతాయని , రెండుమూడు నెలల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. కరెంట్‌ ఖాతాలోటు ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఈ ఏడాది కరెంట్‌ ఖాతా లోటు 5 శాతం కంటె తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ద్రవ్యోల్చణం ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పారు. వస్తు, సేవల పన్ను మరో 13 నెలల్లో కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలిపారు.