ఆలుగడ్డ పంటపై తెగుళ్ళను నివారించాలి: డిఏఓ
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న ఆలుగడ్డ పంటను జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహారావు గురువారం సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు పంటపై ఆశించిన తెగుళ్లను గుర్తించారు. పంట ఎదుగుదల కోసం తెగులును సత్వరమే నివారించాలని సూచించారు. ఈ మేరకు సాగు సస్యరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై తగు సలహాలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏడీఏ భిక్షపతి, ఏవో నవీన్ కుమార్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.