” ఇంటర్నేషనల్ కాల్స్ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న ఘరానా ముఠా అరెస్ట్ ల్యాబ్ టాపులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం..”
శేరిలింగంపల్లి, ఆగస్టు 29( జనంసాక్షి): ఇంటర్నేషనల్ కాలర్ సమసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 17 సభ్యుల ఓ ఘరానా ముఠాను హైదరాబాదు పోలీసులు అదుపులోకితీసుకొని సోమవారం రిమాండ్ తరలించిన ఘటన నగరంలో సంచలనంగా మారింది. సైబరాబాద్ పోలీస్ బాస్ వెల్లడించిన వివరాల ప్రకారం… కేరళ మలప్పురం ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీ, ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన గంధం వీరరామ నరేష్, పశ్చిమగోదావరి జిల్లాకుచెందిన కళ్యాణ్ చక్రవర్తి బ్రతుకుదెరువుకోసం నగరానికి వచ్చి హైదరాబాదులో ఉంటున్నారు. వీరు గతంలో క్రెప్టో ట్రేడింగ్ బిజినెస్ నిర్వహిస్తుండేవారు. కాగా కోల్ కత్తా కు చెందిన రియాన్ అలియాస్ మనీష్ గుప్త, అమర్ జీత్ గిరి అలియాస్ క్రిష్టి విల్సన్, మహమ్మద్ ఇమ్రాన్, సందీప్ శర్మ తో ముఠాగా ఏర్పడిన తర్వాత అమెరికన్లకు, ఇతర దేశాలకు చెందిన కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని వారికి ఇంటర్నెట్ ఆంటీ వైరస్ ఇన్స్టాల్ చేస్తామని, మెయిల్ టూ మెయిల్ కాల్ సర్వీస్ సేవలు అందిస్తామని, రెడీమ్ గిఫ్టులను తమ కంపెనీ ద్వారా కావలసిన వారికి అందజేస్తామనే సారాంశంతో ఒక ప్రముఖ ఆన్లైన్ కంపెనీ అనుబంధంగా పనిచేస్తున్నట్లు రికార్డులను సృష్టించి ఒక ఫేక్ టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా పెరూ, అమెరికా, థాయిలాండ్, సింగపూర్ తదితర దేశాలకు చెందిన అమాయకులకు పెద్ద మొత్తంలో మెసేజ్ లను, మెయిల్స్ ను పంపిస్తూ తమ బుట్టలో వేసుకోవడం అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో వారికి యాంటీవైరస్ లైసెన్సులను కొత్త కనెక్షన్స్, లైసెన్స్ రెన్యువల్ చేస్తామని చెబుతూ వారి వద్ద నుండి అందినకాడికి డబ్బులను డబ్బులను దండుకోవడం, ఆ తరువాత బాధితుల నుండి అందే ఫిర్యాదులను స్వీకరించకుండా తప్పించుకోవడం వీరి ప్రధాన లక్ష్యమని పోలీస్ బాస్ వివరించారు. డార్క్ నెట్ నుంచి వివోఐపి నెంబరును తీసుకొని రియాన్, అమర్ జీత్, ఇమ్రాన్ కాల్స్ ని విదేశీయులకు పంపిస్తూ వారిని బుట్టలో పడవేయడం మీరు ప్రధాన కర్తవ్యం అన్నారు. ఈ ముఠాలో అభిషేక్ సింగ్, హేమంత్ సింగ్, ఆమన్ షా, అషీష్ జైస్వాల్, విక్కీ కుమార్ షా, అమన్ షా, ధనిష్ ఖాన్, విక్కీ సింగ్, సాహిల్ నూర్ హసన్ తదితరులు ఆర్థిక లావాదేవీలను పకడ్బందీగా నిర్వహించి నిందితుల ఖాతాలోకి డబ్బులు మళ్లించడం వీరి ప్రధాన లక్ష్యమన్నారు. కాగా నిందితుల నుండి 10 లాప్టాప్ లు, 20 మొబైల్ ఫోన్లు, 4 రౌటర్లు, లెటర్ హెడ్, లైసెన్స్ అగ్రిమెంట్, సర్టిఫికెట్ ఆఫ్ ఇన్ కార్పొరేషన్ తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకొని సీజ్ చేసి నిందితులను అంతా రిమాండ్ కు తరలించడం జరిగింది.
