ఉద్యమాల ద్వారానే విద్యారంగ సమస్యలు పరిష్కారం.

టి.పి.టి ఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్
ఫోటో రైటప్: సమావేశంలో మాట్లాడుతున్న
భోగేశ్వర్..
వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 20 (జనం సాక్షి)
ఉపాద్యాయ,విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాద్యాయ ఉద్యమాలే పరిష్కారం అని టి. పి.టి ఫ్.రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ అన్నారు.
మంగళవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో పలు పాఠశాల సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. సందర్భంగా భోగేశ్వర్ మాట్లాడుతూ
 బదిలీలు,పదోన్నతుల షెడ్యూలు విడుదల చేస్తామని   మార్చి 10 న,అసెంబ్లీ లో ప్రకటించిన ఇంతవరకు షెడ్యూలు విడుదల చేయలేదని అన్నారు.ఏడేళ్లుగా పదోన్నతులు,17 ఏళ్లుగా పరువెక్షన అధికారుల నియామకాలు లేక విద్యా వ్యవస్థ లో తీవ్ర సంక్షోభం నెలకొన్నదనీ,సబ్జెక్ట్ టీచర్స్ కొరత తో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
రాష్ట్ర విద్యా శాఖ లో ఖాళీ గా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ   అసెంబ్లీ ముట్టడి చేసిన   స్పందించక పోవడం ప్రజాస్వామ్య  హక్కను దిక్కరించడమే అని ఆవేదన వ్యక్తం చేశారు.            వివిధపాఠశాల లో సమస్యలు సేకరణ లో భాగంగాలో వివిధ పాఠశాలలో
 సుమారు ఇరవై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఖాళీలను భర్తీ చేయకుండా
తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు.
 వివిధ పధకాలను పెట్టి ఉపాధ్యాయుల పై పనిభారం మోపటం వల్ల విద్యారంగంలో సరైన ఫలితాలు రావని, ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పాఠశాల ప్రారంభమై రెండు నెలలు దాటినా పాఠశాలలకు ఏవిధమైన నిధులు (గ్రాంట్స్) విడుదల చేయకుండా ‌అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలను ఇవ్వడం జరుగుతుందని, పాఠశాల యస్.యం.సి ఖాతాలను కూడా గత ఏప్రిల్ నెలలో క్లోజ్ చేయించారని, పాఠశాలలు నడపటంలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.*జిల్లా కార్యదర్శి పి మనోజ్ గౌడ్* మాట్లాడుతూ సంవత్సరాల తరబడి పదోన్నతులు, బదిలీల కోరకు ఎదురుచూస్తునారని, 317 జి‌ఓ బాధితుల అప్పీల్స్ అన్నింటినీ పరిష్కారించాలని, కె.జి.బి.వి ఉపాధ్యాయినీల సమస్యలు పరిష్కరించాలని, నెలలు తరబడి పెండింగ్ లో ఉన్న జి.పి.యఫ్ , టి.యస్.జి.యల్.ఐ , సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ రియింబర్సమెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశం లో  వరంగల్ జిల్లా కార్యదర్శి పూజారి మనోజ్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజి అధ్యక్షుడు  అశోక్ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి బి .సురేష్ ఈ దుల వీరస్వామి , బి.జగన్ తదితరులు పాల్గొన్నారు.