ఉపాధిహావిూ పథకాలతో ప్రభుత్వ ఆదాయం

దుబారా ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేయలంటున్న నిపుణులు

అభివృద్ది పనులకు కొరవడుతున్న నిధులు

న్యూఢల్లీి,నవంబర్‌22 (జనం సాక్షి): ఉపాధిహావిూ లాంటి పథకాల వల్ల వేలకోట్లు దుర్విని యోగం అవుతు న్నాయి. రూపాయికే బియ్యం పథకం వల్ల వేలకోట్లు దుర్వినియోగం అవుతున్నాయి.రైతుబందు, ఉచిత విద్యుత పథకాలు కూడా ప్రజలపై భారం మోపుతున్నాయి. వాటి కారణంగా గ్రామాల్లో ఆర్థిరక వ్యవస్థ చితికి పోయింది. ఉపాధిహావిూ పథకం కారణంగా పనిచేయకున్నా కూలి వస్తోందన్న ధీమాతో ఇతరత్రా కూలీలకు వెళ్లడం లేదు. విద్య,వైద్య రంగాలు, కమ్యూనికేషన్‌, రోడ్లు రవాణా రంగం అభివృద్ది చేసి, ప్రజలు స్వయం సమృద్ది సాగించేలా పాలన సాగాలన్న ఆలోచనలో ప్రభుత్వాలు లేకుండా పోయాయి.  రాష్టాల్రు కూడా ప్రజాకర్షక పథకాలతో ప్రజలు చెమటోడ్చి పన్నుల రూపంలో కట్టిన డబ్బులు వృధా చేయడంలో పోటీ పడుతున్నాయి. దుబారా పథకాలను తెరపైకి తెచ్చి అభివృద్ది రంగాన్ని వెనక్కి నెట్టాయి. ఇలాంటి పథకాలపై కేంద్రం అజమాయి షీలో నియంత్రణ ఉండాలి. పండగలు, పబ్బాలు, కులాలు,మతాల పేరుతో డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా, కేవలం అభివృద్ది పథకాలకు మాత్రమే ఖర్చు చేయగలగాలి. ప్రజల కోసం కాకుండా కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెంచిన పన్నులు తగ్గించి మెహర్బానీ ప్రకటించినంత మాత్రాన ప్రజలకు మేలు జరగదని గుర్తించాలి. జీఎస్టీతో సంక్షోభంలో పడ్డ పరిశ్రమలకు పన్నుభారం తగ్గించాలని కోరుకుంటున్నారు. విలాస వస్తువుల శ్లాబ్‌లో 228 వస్తువులుండగా వాటిని యాభైకి తగ్గించేసింది. నిర్మాణరంగానికి అత్యంత కీలకమైన సిమెంటు, పెయింట్లను మాత్రం విలాస వస్తువుల జాబితాలోనే ఉంచింది. 18 శాతం శ్లాబ్‌ నుంచి 13 రకాల వస్తువులను 12 శాతం శ్లాబ్‌కు మార్చారు. వ్యాపారుల్లో ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వర్తకులు ఆందోళన చెందుతున్నా పట్టించుకోవడం లేదు. నోట్లరద్దు సమయంలో వ్యవహరించిన తొందరపాటునే ఇక్కడా ప్రదర్శిస్తున్నారని కూడా అంటున్నారు. ఇలా అనేకులు తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, కొన్ని రంగాలకు పన్నులు వద్దనో లేదా శ్లాబ్‌ రేటు తగ్గించాలనో అనేక రాష్టాల్ర ప్రభుత్వాలు కేంద్రానికి సూచించినా పెడచెవిన పెట్టారు. ఎందుకంటే పెద్దనోట్ల రద్దు తరవాత పడుతున్న కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇకపోతే జిఎస్టిపై చిన్న, మధ్యతరగతి వ్యాపారులు ఆందోళనతో ఉన్నారు.  మొత్తానికి అభ్యంతరాలకు అవకాశం ఇవ్వకుండా ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలులోకి తీసుకుని వచ్చేందుకు రూపొందించిన జిఎస్‌టి ఇప్పుడు ప్రజలకు గుదిబండగా మారింది.   ఏకీకృత పన్ను విధానం అమల్లోకి వచ్చిందే తప్ప ఆర్థిక సంస్కరణలు అనడానికి వీల్లేకుండా చేసింది. పేద,సామాన్యులే బలిపశువులు అని గుర్తించి నిర్ణయాలు తీసుకుంటే తప్ప దేశం ముందుకు సాగదు. వ్యవసాయ చట్టాలను రద్దుచేసినట్లుగానే జిఎస్టీ భారాన్ని సవిూక్షించాలన్న డిమాండ్‌పై తక్షణచర్యలు తీసుకోవాలి. ప్రధానంగా గృహనిర్మాణరంగాన్ని నిలబెట్టాలి.