ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సమావేశం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసమివేశం సచివాలయంలో జరిగింది. ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న హైకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించి సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు వారు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరఠణ చేయాలని సీఎంతో కలిసి త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నట్టు మంత్రులు తెలిపారు.