ఎమ్మెల్యేను కలిసిన ఉత్సవ కమిటీ బాధ్యులు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 20(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని ఉరుసు గుట్ట వద్ద గల రంగలీల మైదానంలో జరిగిన సమావేశంలో మంగళవారం ఉరుసు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ బాధ్యులు గోనె రాంప్రసాద్, సుంకరి సంజీవ్, వెంకన్న, బొల్లం మధు తదితరులు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సత్కరించారు. సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే నరేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.