ఎమ్మెల్యే నరేందర్ ను కలిసిన దసరా ఉత్సవ కమిటి..
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 15(జనం సాక్షి)
శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దసరా ఉత్సవ కమిటి ప్రతినిదులు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసారు..సద్దుల బతుకమ్మ,రావణ వధ,దసరా ఉత్సవాలకు రంగలీలా మైదానంలో విస్తృత ఏర్పాటు చేసేలా అదికారులకు తగు సూచనలు,ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేను వారు కోరారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ,దసరా పండుగలని,ఈ పండుగలు ఘనంగా నిర్వహించుకుందామన్నారు..మన సంస్కృతి,సంప్రదాయాలే మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే కానుకలు అన్నారు..ఈ సారి కూడా బతుకమ్మ,దసరా ఉత్సవాలు రంగలీలా మైదానంలో ఘనంగా నిర్వహించేలా అదికారులకు తెలియజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు..
ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటి అద్యక్షులు నాగపురి సంజయ్ బాబు,కోశాదికారి మండె వెంకన్న గౌడ్,కన్వీనర్ వడ్నాల నరేందర్,ఉపాద్యక్షులు వంగరి కోటేశ్వర్,మేడిద మదుసూదన్,కార్యనిర్వాహక కార్యదర్శులు వొగిలిశెట్టి అనీల్ కుమార్,గోనె రాంప్రసాద్,నాగపురి రంజిత్ గౌడ్,పొగాకు సందీప్,కార్యదర్శులు సుంకరి సంజీవ్,బజ్జూరి వాసు,కత్తెరశాల వేణుగోపాల్,నాగపురి మహేష్,నాగపురి సంతోష్,పొగాకు చిరంజీవి,గట్టు రమేష్,వలుస వినయ్,నరిగె శ్రీను,బత్తిని అఖిల్ గౌడ్,బైరి వంశి,బత్తిని రంజిత్,బైరగోని మనోహర్,ఎలగందుల కృష్ణమూర్తి,తదితరులు పాల్గొన్నారు.
Attachments area