ఎమ్మెల్యే హరిప్రియను కలిసిన వై జంక్షన్, టోల్గేట్ బాధితులు-అండగా ఉండి ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి
టేకులపల్లి, ఆగస్టు 23 (జనం సాక్షి): నేషనల్ హైవే నిర్మాణంలో టేకులపల్లి మండల కేంద్రంలోని వై జంక్షన్ బాధితులు, సులానగర్ గ్రామానికి చెందిన టోల్గేట్ బాధితులు బుధవారం టేకులపల్లి లోని ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయకును కలిసి వివరించారు. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవితతో ఫోనులో మాట్లాడి బాధితుల సమస్యలను వివరించారు. అధికారులతో మాట్లాడి శుక్రవారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్లు ఎమ్మెల్యే ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ కు పార్టీ టికెట్ కేటాయించడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాధితులంతా తమకు అండగా ఉండి ఆదుకోవాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. వలికొండ( హైదరాబాద్) నుంచి ఇల్లందు మీదుగా కొత్తగూడెం వరకు జాతీయ రహదారి 930పి నెంబర్ తో నిర్మాణం చేపట్టడం కోసం రహదారికి ఇరువైపులా రోడ్డు వెడల్పు విస్తరణలో భాగంగా సర్వే చేస్తూ జెండాలు పాతే ప్రక్రియ చేపట్టారు. కొత్తగూడెం నుండి ఇల్లందు వరకు నాలుగు లైన్ల రహదారి కోసం సర్వే ముమ్మరం చేశారు. దీంతో టేకులపల్లి మండల కేంద్రం నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల పరిధిలో బోడు రోడ్డు సెంటర్లో వై జంక్షన్ ఏర్పాటు చేయడానికి సుమారు 100 అడుగులు తీసుకోవడంతో ఆ సెంటర్లోని షాపింగ్ భవన నిర్మాణాలన్నీ పూర్తిగా తొలగించే ప్రమాదం ఏర్పడింది. మండల కేంద్రం నుండి మరొక రెండు కిలోమీటర్ల దూరంలో ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో కూడా రింగ్ రోడ్డు ఏర్పాటు కోసం 100 అడుగులు వరకు జెండాలు పాతడంతో ఆ సెంటర్లోని షాపింగ్ భవన సముదాయాలన్నీ పూర్తిగా తొలగించే ప్రమాదం ఏర్పడింది. ముత్యాలంపాడు నుండి మరొక కిలోమీటర్ దూరంలో సులానగర్, సీతారాంపురం( రాజ్ తండా ) గ