ఎమ్మెల్సీ తాతా మధు ను విమర్శించే స్థాయి మీకు లేదు-ఎలమద్ది రవి మండిపాటు
ఇల్లందు జూలై 27 (జనం సాక్షి న్యూస్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంగిలి మెతుకులకు ఆశపడి బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధ పై మానవతారాయ్ చేసిన అర్ధరహితమైన వాక్యాలను సహించబోమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు యలమద్ది రవి మానవతారాయిపై తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ సందర్భంగా ఎలమద్ది రవి మాట్లాడుతూ..ఎవరో ఏంటో తెలియకుండా వ్యక్తిగతంగా మాట్లాడడమే కాకుండా ఇంకోసారి తాతా మధు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మండిపడ్డారు. కెసిఆర్ పుణ్యమా అని కాంట్రాక్టర్ వర్కులు చేసుకుని కాంట్రాక్టర్ గా ఎదిగిన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వేసే నాలుగు ఎంగిలి మెతుకులకు ఆశపడి అడ్డగోలు మాటలు మాట్లాడితే సహించేది లేదు అని హెచ్చరించారు. ఒక వ్యక్తి స్థాయిని హోదాని పక్కకు పెట్టి ఒరేయ్ అని సంబోధించడం నీ సంస్కారాన్ని తెలుపుతుందని,నిజంగా నీకు విలువలు సంస్కారం అనేది ఉంటే అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టిన పొంగులేటి పక్కన చేరి ఇలాంటి మాటలు మాట్లాడడం మీ స్థాయిని దిగజారిస్తుంది అని అన్నారు.నిరంతరం తను నమ్మిన పార్టీ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తాత మధు మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గులేని పని అని, నీలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం నాలుగు అవాకులు చవాకులు పేలితే సెలబ్రిటీ అవుతావు అనుకొని మాట్లాడితే సహించేది లేదు అని హెచ్చరించారు. ఒక దళిత ఎమ్మెల్యే అయిన సండ్ర వెంకట వీరయ్య మీద నీకు ఎంగిలి మెతుకులు పెడుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమర్యాదగా మాట్లాడుతూ, విమర్శించిన మాటలు నీకు వినిపించ లేదా అని ప్రశ్నించారు…?ఒక దళిత ఎమ్మెల్యేని విమర్శించిన పొంగిలేటి పక్కన నిలబడి మాట్లాడడం అది నీ విజ్ఞతకే తెలియాలి నీ పదవి కాంక్ష కోసం దళితుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ పంచన చేరిన నీకు అసలు సీటు వస్తుందో లేదో నీకే తెలియదు వచ్చిన నిన్ను ఇక్కడ దళితులు అంటే ఏమిటో నీకు రుచి చూపించే రోజు దగ్గర్లోనే ఉంది అని అన్నారు…అంతే కాకుండా అహర్నిశలు పార్టీ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న తాత మధుని పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం నువ్వేదో వీరుడు దీరుడు అన్నట్లుగా పొంగిపోకు, నువ్వేంటి నీ స్థాయి ఏంటి అనేది ఆలోచించి మాట్లాడటం మంచిది అని అన్నారు.నాలుగు ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి నీ భవిష్యత్తును ఆగం చేసుకోకని ఓ మిత్రుడిగా సలహానిస్తున్నానని ఎద్దేవా చేశారు. నీ ఎమ్మెల్యే పదవి కోసం దళితుల ఆత్మగౌరవాన్ని పొంగులేటి శ్రీనివాస్ దగ్గర తాకట్టు పెట్టావని ఎద్దేవా చేశారు.. తాతా మధు మీద నోరు జారి మాట్లాడితే మానవతారాయి ఖబర్దార్ ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు.