ఎర్ర చందనం పట్టివేత
నెల్లూరు: జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల అటవీశాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాథీనం చేసుకున్నారు. బాలయపల్లి మండలం నిందలి- కడగుంట రహాదారిలో అక్రమంగా తరలిస్తున్న రూ. 7 లక్షల విలువ చేసే 50 ఎర్రచందనం దుంగలను అధికారులు పట్టుకున్నారు. మరో ఘటనలో డక్కిలి మండలం మాధవయ్యపాలెం వద్ద తనిఖీలు చేపట్టి రూ.6లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.



