ఎల్ హెచ్ పిఎస్ మహబూబాద్ పార్లమెంట్ ఇంచార్జిగా తేజావత్ వినోద్ నాయక్ ఎన్నికఎల్ హెచ్ పిఎస్

 

 

 

 

సిరోల్ డిసెంబర్/14:జనంసాక్షి న్యూస్:సిరోలు మండలం మహబూబాబాద్ జిల్లా రూప్లా నాయక్ తండకు చెందిన తేజావత్ వినోద్ నాయక్ ను లంబాడా హక్కుల పోరాట సమితి మహబూబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా నియమించినట్లు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు హరినాయక్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ బీమా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ గిరిజన జాతి హక్కుల కోసం 25 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న బెల్లైనా కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.దేశంలో 18 కోట్ల మంది గిరిజనులు ఉన్నారని వారి హక్కుల కోసం 18 శాతం రిజర్వేషన్ కోసం పోరాటాలకు గిరిజనులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.పోడు భూములకు హక్కు పత్రాలు సాగు చేసుకుంటున్న గిరిజనులకు అందరికీ ఎలాంటి షరతులు లేకుండా హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు గిరిజన బంధు తక్షణమే ప్రకటించాలని వారు కోరారు.తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి 3170 కు పైన సర్పంచులు అయ్యారంటే ఎల్ హెచ్ పి ఎస్ పోరాట ఫలితం అని అన్నారు.ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి డబల్ బెడ్ రూమ్ రైతుల రుణాలు మాఫీ తక్షణమే చేయాలని సంఘం డిమాండ్ చేసింది.పార్లమెంట్ లోని తండాల కమిటీల నిర్మాణం ప్రతి కార్యకర్త పూర్తి చేయాలని హరి నాయక్,భీమా నాయక్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు విష్ణు నాయక్, శివ,వర్మ నాయక్,రాందాస్ నాయక్,సురేష్ నాయక్,గాంధీ నాయక్, రాంజీ నాయక్,సంతు నాయక్, గణేష్ నాయక్ పాల్గొన్నారు.