ఒప్పో సబ్‌ బ్రాండ్‌ రియల్‌ మి నుండి రియల్‌ మి యు 1 విడుదల

న్యూఢిల్లీ,నవంబర్‌ 28( జనంసాక్షి) : ఒప్పో తన రియల్‌ మి సబ్‌బ్రాండ్‌ ఆధ్వర్యంలో మరో నూతన

స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మి యు1 పేరిట విడుదలైన ఈ నూతన ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్‌ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 25 మెగాపిక్సల్‌ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. బ్రేవ్‌ బ్లూ, యాంబిషియస్‌ బ్లాక్‌ కలర్‌ వేరియెంట్లలో విడుదలైన రియల్‌మి యు1 ఫోన్‌ 3/4 జీబీ ర్యామ్‌ వేరియెంట్లలో రూ.11,999, రూ.14,499 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది. అమెజాన్‌లో డిసెంబర్‌ 5వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఈ ఫోన్‌తోపాటు రూ.499 చెల్లిస్తే ఆకట్టుకునే డిజైనర్‌ కేస్‌లను అందిస్తారు. ఇక లాంచింగ్‌ సందర్భంగా ఈ ఫోన్‌పై ఎస్‌బీఐ కార్డ్స్‌తో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. జియో తన యూజర్లకు ఈ ఫోన్‌ ద్వారా 4.2 టీబీ అదనపు డేటాను ఉచితంగా అందిస్తున్నది.

రియల్‌ మి యు1 ఫీచర్లు…

6.3 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 2350 లీ 1080 పిక్సల్స్‌ స్కీన్ర్‌ రిజల్యూషన్‌, గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, డెడికేటెడ్‌ మొమొరీ కార్డ్‌ స్లాట్‌, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 25 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 4.2, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ.