కరీమాబాదులో బొడ్డెమ్మ వేడుకలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 16(జనం సాక్షి)
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ ప్రాంతంలో శుక్రవారం బొడ్డెమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత సంస్కృతి సంప్రదాయాలు ఇనుమడింపజేసేలా బొడ్డెమ్మ పాటలతో మహిళలు పిల్లలు పెద్దలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి. మాధవి టి. స్వప్న, రచన, కరుణ, లలిత, శోభ, తదితరులు పాల్గొన్నారు ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించే బొడ్డెమ్మ వేడుకలను ప్రతి ఏటా తాము ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నట్లు మహిళలు తెలిపారు.
Attachments area