కరీమాబాదులో వినాయకుని నిమజ్జనోత్సవం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 12(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం( బొమ్మల) గుడిలో ఏర్పాటుచేసిన వినాయకుని నిమజ్జనోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకునికి మహిళలు పిల్లలు పెద్దలు మంగళహారతులు పట్టారు. డబ్బు చప్పుల నడుమ వినాయకుని ఉరుసు రంగసముద్రం చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మిని రాజేందర్, పవిడాల సంపత్, కోదాటి శ్యామ్ వి. భరత్ కుమార్, గోనె భావేష్ కుమార్, సాయి తేజ, కొమ్మిని సన్నీ రిత్విక్ తో పాటు వి. సంజీవరావు, జి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area