కరీమాబాద్ స్కూల్లో తొలిమెట్టు కార్యక్రమం పరిశీలన
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 20(జనం సాక్షి)
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఖరీమాబాద్ కు సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీ సుధీర్ బాబు మంగళవారం విచ్చేసి వివిధ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగింది.దీనిలో భాగంగా తోలిమెట్టు కార్యక్రమం అమలు పరిశీలించి ఉపాధ్యాయు బృందం తో సమీక్షించి విద్యార్థులను పరీక్షించడం జరిగింది.మరియు మధ్యాన్నం భోజనం నిర్వహకులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం అందించాలని వంట చేసే విషయం లో సూచి శుభ్రత పాటించాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించడం జరిగింది. అదనపు తరగతి గదులు నిర్మాణం వాస్తవికతని తెలుసుకోవడానికి క్షేత్ర పర్యటన లో పరిశీలించి డం జరిగింది.. దీనికి సంబందించి అన్ని రకాల రికార్డ్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల లోటు ను అధిగమించి కృషి చేస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని సెక్టోరియల్ ఆఫీసర్ సుధీర్ బాబు అభినందించారు..
పాఠశాల పని తీరుపట్ల సంతృప్తి వెలిబుచ్చారు.