కవిత్వం అత్యంత శక్తివంతమైన సాధనం: వెంకయ్య

భువనేశ్వర్‌,అక్టోబర్‌7 ( జనం సాక్షి ) : సామాజిక పరివర్తనకు కవిత శక్తివంతమైన సాధనమనీ.. కవిత్వాన్ని పాఠ్యాంశంలో భాగంగా చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నాడు. ప్రగతికి శాంతియుత వాతావరణం అవసరమన్న ఆయన.. శాంతి, సంతోషం, సోదరభావం, సామరస్యాన్ని సాధించడంలో కవిత్వం ఒక శక్తివంతమైన మాధ్యమమని ఉపరాష్ట్రపతి తెలిపారు. భువనేశ్వర్‌ లో 39వ అంతర్జాతీయ కవి సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.  భారతీయ సంస్కృతి లాగే కవిత్వం  ఎంతో ప్రాచీనమైందన్నారు. మహాభారతం, రామాయణం వంటి గొప్ప ఇతిహాసాలు ఇప్పటివరకు వచ్చిన కవిత్వాల్లో ఉత్తమ ఉదాహరణలన్నారు.