కవి మల్లయ్యమహర్షికి ఉగాది పురస్కారం
జనంసాక్షి, కమాన్ పూర్ : శోభకృత్ నామ నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా రామగుండం ఎంఎల్ఎ, సాహిత్య కళారాధకుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఆత్మీయ కవి సమ్మేళనం ఎంఎల్ఎ అధికారిక నివాస సముదాయంలొ వున్న సమావేశ మందిరంలో బుధవారం ఉగాది రోజు ఏర్పాటు చేసారు. ఈ కవిసమ్మేళనంలొ కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామ నివాసి ప్రముఖకవి, రచయిత, సామాజిక కార్యకర్త రైతు కూచన. మల్లయ్య మహర్షి రాయితీలు గారడి అనే శీర్షికతో కవితా గానం చేయగ ఉగాది పురస్కారం, ప్రశంసాపత్రం పత్రమిచ్చి ఎంఎల్ఎ శాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో నలుబై మంది కవులు పాల్గొని తమ కవితా గానం విన్ఫించారు.