కశ్మీర్‌లో దాచాల్సిన విషయం ఏముంది..

– నా పర్యటనకు అభ్యంతరం ఎందుకు?
– అమెరికా సెనేటర్‌ క్రిస్‌ వాన్‌ ¬లెన్‌
వాషింగ్టన్‌, అక్టోబర్‌5  (జనంసాక్షి):  జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితిని పరిశీలించడం కోసం శ్రీనగర్‌ వెళ్లేందుకు  భారత అధికారులు తనకు అనుమతి నిరాకరించారంటూ అమెరికాలోని డెమొక్రాటిక్‌ పార్టీ సెనేటర్‌ క్రిస్‌ వాన్‌ ¬లెన్‌ ఆరోపించారు. కశ్మీర్‌లో పర్యటించేందుకు ఇది తగిన సమయం కాదంటూ భారత ప్రభుత్వం తనకు చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్‌ భాగస్వామ్య విలువల గురించి చాలా చెబుతాయి. ఇదే సమయంలో పారదర్శకత కూడా చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించిన వాన్‌ ¬లెన్‌… తమకు భారత దేశమంటే అత్యంత అభిమానమని పేర్కొన్నారు. అయితే కశ్మీర్‌ లోయలో ఏంజరుగుతుందో తాము చూడడం భారత ప్రభుత్వానికి ఇష్టలేదని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం దాచాల్సిన విషయం ఏదీ లేకపోతే… అక్కడ ఎవరు పర్యటించనా ఎలాంటి అభ్యంతరం ఉండదని ¬లెన్‌ అన్నారు. కాగా ¬లెన్‌ ఆరోపణలపై భారత అధికారులు ఇంత వరకు స్పందించలేదు. కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేసి, అరెస్టైన వారిని విడుదల చేసేలా మోదీపై ఒత్తిడి తీసుకురావాలంటూ గత నెలలో ¬లెన్‌ సహా నలుగురు అమెరికా సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు. అలాగే ఉగ్రవాదులకు సహకరించడం వంటి పనులన పాకిస్తాన్‌ మానుకోవాలని, కశ్మీర్‌ను అస్థిరపర్చేలా ఎలాంటి చర్యలకు పాల్పడరాదని కూడా వారు స్పష్టం చేశారు.