కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఎల్ఎఫ్ నేత సిద్ధం రాము
– మరో 50 మంది వివిధ పార్టీల కార్యకర్తలు
– కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 12(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ 39 వ డివిజన్ కు చెందిన బిఎల్ఎఫ్ నేత సిద్ధం రాము సోమవారం మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి సిద్ధం రాము ను కొండా మురళి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే సమయంలో మరో 50 మంది వివిధ పార్టీలకు చెందిన వారు కూడా కాంగ్రెస్లో చేరారు. సిద్ధం రాము బిఎల్ఎఫ్ పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి సిద్ధం రాము పోటీ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, మొండి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సిద్ధం రాము తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అండదండలు ఎప్పటికీ ఉంటాయని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు ఈ కార్యక్రమంలో మీసాల ప్రకాష్ మంతెన సునీత దాసి రాందేవ్ బెడిదే వీరన్న కొండపలకల నాగరాజు, వీరస్వామి, హరిబాబు, రాంబాబు, అనిల్, రమేష్, హరి చంటి సూరి తదితరులు పాల్గొన్నారు