*కెసిఆర్ నిరంజన్ రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం*
*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (16):* తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో శుక్రవారం గోపాల్ పేట మండల కేంద్రంలో కెసిఆర్, నిరంజన్ రెడ్డిల చిత్రపటాలకు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి హర్షంవ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టాకు అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య తిరుపతయ్య యాదవ్, జెడ్పిటిసి మంద భార్గవి కోటీశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, టిఆర్ఎస్ మండల నాయకులు కాశీనాథ్ ,మన్యం నాయక్, నాగరాజు, మహేష్, రవి, అనురాధ, రాజేష్ ,దళిత నాయకులు పులేందర్, బెంజిమెన్, ప్రకాష్, గోపాల్ , మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు