కేంద్రానిది మాటల ప్రభుత్వమే 

– హావిూల అమల్లో మోడీ విఫలమయ్యారు
– విభజన హావిూలను విస్మరించారు
– కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కు జాతీయ ¬దా కల్పించాలి
– 16 ఎంపీ స్థానాల్లో తెరాసదే గెలుపు
– ఓటమికి కాంగ్రెస్‌ కుంటిసాకులు వెతుకుతుంది
– నిన్న ఈవీఎంలు అన్నారు.. నేడు చంద్రబాబు అంటున్నారు
విూడియా సమావేశంలో తెరాస ఎంపీలు
న్యూఢిల్లీ, డిసెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హావిూలు అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌,కవిత తదితరులు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హావిూలు అమలు చేయాలని కోరుతూ మంగళవారం కేంద్రమంత్రులను టీఆర్‌ఎస్‌ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా బుధవారం తెలంగాణ భవన్‌లో  విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈసందర్భంగా ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగి నాలుగున్నరేళ్లు దాటినా ఇంకా విభజన హావిూలు నెరవేర్చలేదని విమర్శించారు. మోడీది మాటల ప్రభుత్వమేనని, చేతల ప్రభుత్వం కాదని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ ¬దా కల్పించాలని జితేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తక్షణమే హైకోర్టు విభజన చేయాలన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు ఇవ్వాలన్నారు. రీజనల్‌ రింగ్‌రోడ్డుకు నిధులు విడుదల చేయాలని జితేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినవే ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలో రిజర్వేషన్ల ప్రక్రియకు కేంద్రం సహకరించాలని జితేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్‌ కోరుతున్నారని, నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరామన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించాయని జితేందర్‌రెడ్డి అన్నారు. మోడీ హయాంలో ఒక్క ప్రజాకర్షక పథకం కూడా లేదని జితేందర్‌రెడ్డి విమర్శించారు.విభజన హావిూల అమలుకు  ఇద్దరు కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. తెలంగాణకు దక్కాల్సిన వాటి కోసం విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.  తెలంగాణలో అభివృద్ధి చూసి దేశవిదేశాల నుంచి ఎన్నో కంపెనీలు పెట్టుబడులకు ఉత్సాహం చూపుతున్నాయని వివరించారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాల కోసం తెలంగాణకు రూ.30వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ కేంద్రానికి సిఫార్సు చేసింది. నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా తెలంగాణకు నిధుల విషయంలో కేంద్రం చిన్న చూపు చూస్తోంది. నరేగా నిధులను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్‌ చెబితే కేంద్రం పట్టించుకోవడం లేదు. బీజేపీ మాటల ప్రభుత్వంగా కనిపిస్తోందని విమర్శించారు. ముస్లింలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. తెలంగాణ హక్కులను సాధించుకోవడం కోసం కేంద్రంపై పోరాటం చేస్తాం. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హావిూలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధిస్తామని వివరించారు.
కెసిఆర్‌ సిఎం కావాలన్నది ప్రజల అభీష్టం
తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించిందని ఎంపీ వినోద్‌ కుమార్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు, భద్రాద్రి, యాదాద్రి పవర్‌ప్లాంట్‌ల విషయంలో
కేంద్రం నుంచి అనుమతులు సాధించడంలో కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఎంపీలకు దిశానిర్దేశం చేశారని వివరించారు. తెలంగాణను మళ్లీ కేసీఆర్‌ పరిపాలించాలని ప్రజలు ఎప్పుడో డిసైడయ్యారు. శాసనసభ రద్దు చేసిన నాడే సీఎం కేసీఆర్‌ 105 మంది అభ్యర్థులను ప్రకటించి గెలుస్తామని చెప్పారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఏపీ సీఎం చంద్రబాబును కారణంగా చూపిస్తూ.. కాంగ్రెస్‌ నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దగ్గరలేని ప్రజాకూటమని కేసీఆర్‌ ఎన్నికల సమయంలోనే చెప్పారు. ప్రాజెక్టుల అనుమతుల కోసం టీఆర్‌ఎస్‌ ఎంపీలంతా ఢిల్లీలోనే కేంద్ర మంత్రుల కార్యాలయాల దగ్గర పడిగాపులు కాస్తే.. కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ప్రాజెక్టులు అడ్డుకునేందుకు కోర్టుల చుట్టూ తిరిగారని మండిపడ్డారు.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి లగడపాటి విషపూరిత సర్వేలతో ఎన్నికల తర్వాత మూడు రోజులు ప్రజల్ని నిద్రపోనివ్వలేదని మండిపడ్డారు. లగడపాటి, చంద్రబాబు, కొన్ని విూడియా పత్రికలు పైశాచిక ఆనందం పొందాయన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గ నిర్దేశంలో పని చేసి ప్రజల మొప్పు పొందామని ఎంపీ తెలిపారు. ఉత్తమ్‌కుమార్‌ ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఓటమికి చంద్రబాబు కారణమని కాంగ్రెస్‌ సాకు వేతుకుతోందని విమర్శించారు. కానీ టీఆర్‌ఎస్‌ విజయాన్ని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా కాంగ్రెస్‌ పార్టీ నేతలు కోర్టు పక్షులయ్యారని వ్యాఖ్యానించారు. బాబు పొత్తును కేసీఆర్‌ తిరస్కరిస్తేనే ఆయన కాంగ్రెస్‌ పంచన చేరారని ఎంపీ వినోద్‌ అన్నారు.
16పార్లమెంట్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌దే విజయం – కవిత
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ 16స్థానాల్లో విజయం సాధిస్తుందని నిజామాబాద్‌ ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. ఓటమికి ప్రతిపక్షాలు కుంటి సాకులు వెతుకుతున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమికి తొలుత ఈవీఎంల ట్యాంపరింగ్‌ అన్నారని.. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ తరఫున కీలక భూమిక పోషిస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై కేంద్రంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.  ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెసోళ్లు కుంటిసాకులు చెబుతున్నారని, ఎన్నికల్లో కూటమి హావిూలను రాష్ట్ర ప్రజలు విశ్వసించలేదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా టీఆర్‌ఎస్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని కవిత తెలిపారు. ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతాయని, టీఆర్‌ఎస్‌ కీలకంగా మారబోతోందని కవిత తెలిపారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో 16సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, జి. నగేశ్‌, మసునూరి దయాకర్‌, బిబి ప ఆటి, ఢిల్లీలో అధికరా ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.